చరణ్ చిత్రంలో సల్మాన్?
on Apr 8, 2021
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నిజజీవితంలో మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. అలాంటి.. ఈ ఇద్దరు ఓ సినిమా కోసం తొలిసారిగా కలిసి నటించబోతున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చరణ్ ఓ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్న విషయం విదితమే. ఇందులో ఓ పవర్ ఫుల్ కాప్ రోల్ ఉందట. పాత్ర నిడివి తక్కువే అయినా సినిమాని కీలక మలుపు తిప్పేలా ఉంటుందని బజ్. ఆ పాత్ర కోసం సల్మాన్ ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. మరి.. చరణ్, సల్మాన్ జట్టుకడుతున్నారో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. కాగా, జూలై నుంచి పట్టాలెక్కనున్న చరణ్ - శంకర్ - దిల్ రాజు కాంబో మూవీ వచ్చే ఏడాది జనం ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే.. చరణ్ తాజా చిత్రం `ఆచార్య` మే 13న థియేటర్స్ లో సందడి చేయనుండగా.. అదే రోజు సల్మాన్ ఖాన్ కొత్త సినిమా `రాధే` కూడా విడుదల కానుంది.