సాయి పల్లవి ఖాతాలో మరో రికార్డ్!!
on Jan 22, 2019
ప్రజంట్ హీరోయిన్స్ లో సాయి పల్లవి శైలి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. యాక్టింగ్ లోనే కాదు డాన్స్ లో కూడా తన రూటే సపరేట్ అంటూ నిరూపించుకుంది. బ్రెయిన్ విత్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి డాన్స్ లకు `ఫిదా` కాని ఆడియన్స్ లేరంటే అతిశయోక్తి లేదు. అందుకు నిలువెత్తు నిదర్శనంగా యూ ట్యూబ్ లో ఆమె నర్తించిన పాటలకు దక్కుతున్న ఆదరణ ఎలాంటిదో చెప్పవచ్చు. నిన్నటికి నిన్న `ఫిదా`లోని `వచ్చిండే` పాటతో ధనుష్ వై దిస్ కొలవెరి డీ` (చిత్రం పేరు 3) పేరిట ఉన్న రికార్డులను బద్దలుగొట్టింది సాయి పల్లవి. వై దిస్ కొలవెరి పాటకు 174 మిలియన్లకు పైగా వ్యూస్ ఉంటే...`వచ్చిండే ` పాటకు 178 మిలియన్లకు పైగా వ్యూస్ ఉన్నాయి. సౌత్ ఇండియన్ సినిమాల్లోని పాటల పరంగా ఇది సరికొత్త రికార్డ్ అనే చెప్పాలి.
ఇదిలా ఉంటే...లేటెస్ట్ గా అదే ధనుష్ తో `మారి -2` చిత్రం కోసం కలిసి ఆడి పాడిన `రౌడి బేబి` పాటతో నయా రికార్డ్ ను క్రియేట్ చేస్తోంది సాయి పల్లవి. జనవరి 2న యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన ఈ పాట ...తక్కువ రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ ను రాబట్టుకుంది. ఓ సౌత్ ఇండియన్ సినిమాలోని పాట తక్కువ రోజుల్లోనే ఇన్ని వ్యూస్ ని రాబట్టుకోవడం అరుదైన విషయంగానే చెప్పాలి. మొత్తం మీద యూట్యూబ్ రికార్డ్ లని ఒడిసిపట్టుకోవడంలో సాయి పల్లవి, ధనుష్ పోటీ పడడమే కాదు...కలిసి కూడా రికార్డ్ లు సృష్టించడం విశేషం.