బాహుబలి కంటే ముందు భల్లాల దేవ!!
on Dec 11, 2018
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ జాబితాలో ప్రభాస్ , రానా పేరు ముందు వరుసలో ఉంటాయి. ఈ ఇద్దరూ ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారా? అని వారి అభిమానులతో పాటు అందరూ ఎదురుచూస్తున్నారు. కానీ, వీరి నోట పెళ్లి మాటే రావడం లేదు. మీడియా మిత్రులు ఎలాగైనా వీరి నోటి నుంచి పెళ్లి మాటలు చెప్పించాలని వీలు కుదిరినప్పుడల్లా ట్రై చేస్తూనే ఉంటారు. కానీ వీరు మాత్రం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటేస్తుంటారు. తాజాగా వీరు పెళ్లి గురించి దర్శకుడు రాజమౌళి స్పందించడం హాట్ టాపిక్ అయ్యింది. ఆ వివరాల్లోకి వెళితే.... బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తోన్న కాఫీ విత్ కరణ్ షో కి రాజమౌళి, ప్రభాస్ రానా, అటెండ్ అయ్యారు. అయితే ఈ షోలో పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ప్రశ్నలు కూడా అడిగారు అందులో భాగంగా ప్రభాస్ రానాల మ్యారేజ్ గురించి ప్రస్తానవ వచ్చింది. దీనికి రాజమౌళి స్పందిస్తూ ప్రభాస్ కంటే ముందు రానా పెళ్లి చేసుకుంటాడు అని చెప్పారు .
దీంతో రానా పెళ్లి ఫిక్స్ అయిపోయిందేమో, అది తెలిసే రాజమౌళి ఆ మాట చెప్పారేమో అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. దీనికి సంబంధించి రానా లేదా రానా ఫాదర్ సురేష్ బాబు స్పందిస్తే అసలు మ్యాటర్ ఏంటో బయటకు వస్తుంది. ఏదేమైనా రాజమౌళి చెప్పారు కాబట్టి ఫస్ట్ పెళ్లి పీటలెక్కబోయేది బాహుబలి కాదు భల్లాల దేవ అని ఊహించవచ్చు అంటున్నారు సినీ జనాలు.