గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేసింది!
on Aug 19, 2017
సినిమా తారల పెళ్లిల్లంటే... ఎంత హడావిడి ఉండాలీ... ఎంత హంగామా ఉండాలీ.. పెళ్లికి ముందు ‘సంగీత్ ’.. పెళ్లి తర్వాత రిసెప్షన్.. పబ్బుల్లో... క్లబ్బుల్లో బేచిలర్ ఎండింగ్ పార్టీలూ... అబ్బో ... ఆ హంగామా మాటల్తో చెప్పలేం. కోట్లల్లో డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చయిపోవాల్సిందే. అయితే... బాలీవుడ్ భామ రియాసేన్ పెళ్లి మాత్రం అందుకు భిన్నంగా రహస్యంగా కుటుంబ సభ్యల సమక్షంలో సింపుల్ గా జరిగిపోయింది. రెండు రోజుల క్రితం తన ప్రియుడు ఫోటోగ్రాఫర్ శివమ్ తివారీని వివాహమాడింది రియాసేన్. నిజానికి వీరిద్దరూ గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇటీవల స్లువేనియా ట్రిప్ కి కూడా వెళ్లి నెలరోజులు గడిపి వచ్చారు. ఈ పెళ్లి కేవలం చట్టబద్ధత కోసం మాత్రమేనని కుటుంబ సభ్యలే తెలిపారు. రీయా సేన్ చెల్లెలు రైమా సేన్ వీరి పెళ్లి ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. రియాకు పెళ్లి విషయంలో మొదట్నుంచీ ఓ కచ్చితమైన అభిప్రాయం ఉంది. సినిమా పరిశ్రమకు చెందనివాడిని, నిర్ణయం తీసుకునే విషయంలో స్మార్ట్గ్ గా ఉండేవాడ్ని, వ్యక్తిత్వం కలిగిన మంచి వ్యక్తినీ పెళ్లాడాలనేది ఆమె అభిమతం. దానికి తగ్గట్టే... శివమ్ తివారీని వివాహం ఆడింది రియాసేన్. వీరి పెళ్లి బెంగాళీ సంప్రదాయంతో కుటుంబ సభ్యలు మధ్య చక్కగా జరిగిందని రైమా... ట్విట్టర్ ద్వారా తెలిపింది. 1991లో ‘విషకన్య’ చిత్రం ద్వారా తెరకు పరిచయమైన రియాసేన్... ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ బాషల్లో పలు చిత్రాల్లో నటించింది. పెళ్లి సమయానికి ఆమె వయసు 36.