సింహాతో రవితేజ ఫైట్!
on Nov 3, 2018
సింహా అంటే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘సింహా’ సినిమా అనుకునేరు... కానే కాదు! నటుడు బాబీ సింహా! తమిళ, మలయాళ భాషల్లో పాతిక సినిమాల వరకూ చేశాడు. మొన్నామధ్య తెలుగులో సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘రన్’లో విలన్‌గా నటించాడు. ఇతడితో రవితేజ ఫైట్ చేయనున్నాడు. ఎందుకు? అంటే... రవితేజ హీరోగా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ సినిమాల ఫేమ్ వి.ఐ. అనంద్ దర్శకత్వంలో ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
అందులో బాబీ సింహాను విలన్ రోల్‌కి సెలక్ట్ చేశార్ట! ఈ సినిమాకు ‘డిస్కో రాజా’ టైటిల్ ప్రచారంలో వుంది. త్వరలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఆల్రెడీ ఎస్.ఎస్. తమన్ సినిమా కోసం కొన్ని ట్యూనులు కంపోజ్ చేసి ఇచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభా నటేశ్, ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్పుత్ఎంపిక అయ్యారని ఫిల్మ్‌నగర్ ఖబర్! ఇంకో హీరోయిన్‌కి సినిమాలో ప్లేస్ వుంది. ఆ ప్లేస్‌కి ఎవరికి సెలక్ట్ చేస్తారో మరి!!