`కనకదుర్గ` సాక్షిగా రవితేజ!!
on Mar 15, 2019
తమిళనాటి విజయ్ హీరోగా నటించగా కలెక్షన్ల వర్షం కురపించిన చిత్రం `తెరి`. అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ హీరోగా `కందిరీగ` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఒరిజినల్ వెర్షన్ లోని లైన్ ని మాత్రమే తీసుకుని మార్పులు చేర్పులతో తెలుగుకి తగ్గట్టుగా తెరకెక్కించనున్నాడు సంతోష్ శ్రీనివాస్. ఏప్రిల్ రెండో వారంలో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇందులో రవితేజ్ విక్రమార్కుడు తరహాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి కనకదుర్గ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ సరసన కాజల్, కేథరిన్ నటించే అవకాశాలున్నాయట. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చనున్నాడని సమాచారం.