రవితేజ, తమన్.. వన్స్ మోర్?
on Feb 26, 2021
మాస్ మహారాజా రవితేజకి అచ్చొచ్చిన స్వరకర్తల్లో యువ సంగీత సంచలనం తమన్ ఒకరు. `కిక్`, `ఆంజనేయులు`, `మిరపకాయ్`, `వీర`, `నిప్పు`, `బలుపు`, `పవర్`, `కిక్ 2`, `అమర్ అక్బర్ ఆంటోని`, `డిస్కో రాజా`, `క్రాక్`.. ఇలా వీరి కలయికలో 11 చిత్రాలు రాగా.. వీటిలో `కిక్`, `మిరపకాయ్`, `బలుపు`, `పవర్`, `క్రాక్` మంచి విజయం సాధించాయి. కట్ చేస్తే.. మరోసారి ఈ ఇద్దరు జట్టుకట్టనున్నారని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. `నేను లోకల్` ఫేమ్ త్రినాథరావ్ నక్కిన దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మే నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి తమన్ బాణీలు అందించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే #RT 68లో తమన్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
ఇదిలా ఉంటే.. రవితేజ ప్రస్తుతం `ఖిలాడి`తో బిజీగా ఉన్నారు. మే 28న విడుదల కానున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చుతున్నారు.