తమ్ముడే అనుకున్నారు..అన్న కూడానా..?
on Jul 14, 2017
కొద్దిరోజుల కిందట టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు భరత్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించాడు..భరత్ అంత్యక్రియలకు సినీ పరిశ్రమ నుంచి పెద్దగా ఎవ్వరూ హాజరుకాలేదు..అంతేందుకు స్వయంగా అన్నయ్య రవితేజే రాలేదు..భరత్ డ్రగ్స్ ఎడిక్ట్ అని..ఎప్పుడూ వివాదాలతో కాలం గడుపుతూ ఉంటాడని..రవితేజ కుటుంబం పరువు తీస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ఒకటే చర్చ జరిగింది. గతంలో భరత్ కేసులు..జైలుకు వెళ్లి రావడం వంటి ఘటనలు చూసిన వారు నిజమేనని ఆ ఫ్యామిలీలో రవితేజ ఒక్కడే మంచోడు అంటూ ఫిలింనగర్లో సైతం చర్చించుకున్నారు. కానీ గత కొద్ది రోజులుగా టాలీవుడ్లో జరుగుతున్న పరిణామాలు రవితేజ వ్యక్తిత్వాన్ని శంకించేలా కనిపిస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ రాకెట్ వెనకున్న వ్యక్తులను బయటకు లాగడానికి తెలంగాణ ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగింది ..విచారణలో భాగంగా 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. వారిలో రవితేజ కూడా ఉండటంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది.
కొన్నాళ్ల కిందట రవి ముఖం, శరీరంలో మార్పులు స్పష్టంగా కనిపించడంతో చాలా మందికి అనుమానం వచ్చింది. అయితే ఏజ్ తగ్గించుకునే చర్యల్లో భాగంగా చికిత్స చేయించుకోవడం వల్లే ఈ మార్పు వచ్చినట్లు వార్తలు వచ్చాయి..అది నిజం కాదనీ ఆయన డ్రగ్స్‌కు బానిస కావడం వల్లే ఈ మార్పులొచ్చాయని సినీ జనాలు చెవులు కొరుక్కున్నారు. అయితే పోలీసులు డ్రగ్స్ కేసులో రవితేజకు నోటీసులు ఇవ్వడంతో అందరి అనుమానాలు నిజమయ్యాయి. మరికొందరైతే తన తమ్ముడి విషయంలో పదిమంది పది రకాలుగా అనుకుంటున్నా..? నోరు మెదపని రవితేజ, తను మాత్రం మంచివాడుగా ఇన్నాళ్లు జనాల్ని మోసం చేశాడని..ఈ రోజున తన బండారం బయటపడిందని, తన తమ్ముడి అంత్యక్రియలకు హాజరుకాని రవితేజ ఇప్పుడు ఏం సమాధానం చెబుతాడు అని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకీ మాస్ మహారాజ్ డ్రగ్స్ వాడాడో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..అప్పటి వరకు మీ అనుమానాన్ని.. అనుమానంగానే ఉంచండి.
Also Read