రష్మిక కంట్రోల్లో అక్కినేని హీరో..!!!
on Sep 22, 2018
ఒక్క రోజు ముఖ్యమంత్రిలా...ఇటీవల హీరోయిన్ రష్మిక అక్కినేని నాగార్జునకు ఒక్క రోజు బాడీ గార్డ్ గా చేసిందట. వైజయంతి బేనర్ లో నాగార్జున, నాని హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం `దేవ దాస్`. ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోనాని కి జోడీగా నటించిన రష్మిక మీడియాతో మాట్లాడింది. ``ఇటీవల నేను, నాగార్జున గారు కలిసి ఒకే ఫ్లైట్ లో ప్రయాణించాం. ఆ ఫ్టైట్లో చాలా మంది నాగార్జున గారితో సెల్ఫీలు దిగడానికి, మాట్లాడటానికి మీద మీద పడిపోయారు. ఆ సమయంలో నేను వారందర్నీ కంట్రోల్ చేస్తూ నాగార్జున గారికి ఫ్లైట్ దిగే వరకు బాడీ గార్డ్ లా వ్యవహరించాను. ఇక మీదట కూడా ఎవరైనా నాగార్జున గారితో సెల్ఫీలు దిగాలంటే నన్నే సంప్రదించాలంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది.
`ఛలో` ,గీత గోవిందం` చిత్రాలు బ్లాక్ బస్టర్స్ కావడంతో రష్మిక `దేవదాస్` తో హ్యాట్రిక్ కొట్టబోతున్నా అంటూ కాన్ఫిడెంట్ తో చెబుతోంది. ఈ చిత్రంలో పూజ పాత్రలో నటించింది రష్మిక. నాగార్జున , నాని గార్లతో నటించడం చాలా హ్యాపీగా ఉందంటూ, చాలా నేర్చుకున్నా అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో `డియర్ కామ్రెడ్` చిత్రంలో నటిస్తున్నా ఇంకా కొన్ని చిత్రాలు చర్చల్లో ఉన్నాయి. కానీ తన పర్సనల్ విషయాలు గురించి మాత్రం షేర్ చేసుకోవడానికి ఇష్టపడలేదు రష్మిక.