ఈ సంక్రాంతికి డోస్ పెంచుతున్న రష్మిక
on Nov 26, 2020
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ అందుకుంది రష్మిక మందన్న. ఆ సినిమాలో మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సరసన సందడి చేయడం.. రష్మికకి బాగా కలిసొచ్చింది. ఇలా.. తనకో మెమరబుల్ హిట్ ని ఇచ్చిన సంక్రాంతి సీజన్ లో మరోసారి మురిపించేందుకు రష్మిక సిద్ధమవుతోంది. ఈ సారి ఏకంగా రెండేసి సినిమాలతో పలకరించనుందట ఈ అమ్మడు. అయితే.. స్ట్రయిట్ పిక్చర్స్ తో కాకుండా.. డబ్బింగ్ మూవీస్ తో రష్మిక పలకరించనుండడం విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. రష్మిక నటించిన తొలి తమిళ చిత్రం సుల్తాన్ ని 2021 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు కార్తి అండ్ టీమ్ ప్లాన్ చేస్తుండగా.. ఆమె తాజా కన్నడ చిత్రం పొగరు (ఇందులో ధ్రువ సర్జా కథానాయకుడు) కూడా అదే సీజన్ లో తెరపైకి రానుందట. అంతేకాదు.. తెలుగులోనూ ఈ చిత్రాలను జనవరి 14నే విడుదల చేసే దిశగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి.. ఒకే రోజు రాబోతున్న ఈ అనువాద చిత్రాలు రష్మిక కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
