`మహర్షి` తో రష్మిక రొమాన్స్!!
on May 11, 2019
అవును మీరు చదివింది నిజమే...! సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక నటిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే రష్మికకు స్టోరి కూడా వినిపించాడట అనిల్ రావిపూడి. స్టోరి నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట రష్మిక. ఇక జూలై లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రూపొందతోన్న ఈ సినిమాలో ఇప్పటికే మహేష్ అమ్మగా రమ్యకృష్ణ, అత్తగా విజయశాంతిని ఫైనల్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల గురించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 9న విడుదలైన మహర్షి యావరేజ్ టాక్ తో వెళ్తోంది. మహేష నటనకు మంచి పేరొచ్చింది.