నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా రష్మిక! గూగుల్ సర్ప్రైజ్
on Nov 20, 2020
ముదుగుమ్మ రష్మిక మందన్నకు గూగుల్ సర్ప్రైజ్ ఇచ్చింది. గూగుల్ లో ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’ అని టైప్ చేస్తే రష్మిక మందన్న పేరు వస్తుంది. రష్మిక నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా మారిందని, ఆమె దుస్తుల ఎంపిక ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని గూగుల్ చూపెడుతోంది. ఆమె సరికొత్త లుక్ కూడా ఆకర్షిస్తోందని వస్తుంది. తెలుగు, కన్నడ సినిమాల్లో నటిస్తూ హిట్లు కొడుతున్న రష్మికకు గూగుల్ ఇలా సర్ప్రైజ్ ఇవ్వడం పట్ల ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు.
తెలుగులో మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన తర్వాత ఆమె పాప్యులారిటీ మరింత పెరిగింది. ప్రస్తుతం ఆమె మరో స్టార్ హీరో అల్లు అర్జున్ తో 'పుష్ప' సినిమాలో నటిస్తోంది. ప్యాన్ ఇండియా మూవీగా ఇది రూపుదిద్దుకుంటోంది. తమిళ సినిమాల్లోనూ రష్మిక ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ సినిమాల్లో మాత్రం రష్మిక నటించలేదు. అయినా ఆమెను నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా గా గూగుల్ చూపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read