English | Telugu

100 కోట్ల మార్కు దాటేసిన రంగస్థలం

on Apr 3, 2018

 

విడుదలయిన మొదటి రోజు సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్న రంగస్థలం కేవలం నాలుగు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డు నెలకొల్పింది. మగధీర తరవాత అంతటి హిట్ లేక బాధపడుతున్న రామ్ చరణ్ కి, రంగస్థలంతో మంచి ఊరట లభించింది. మొత్తానికి, 4 రోజులకి గాను 102 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన రంగస్థలం, ప్రపంచవ్యాప్తంగా 63 కోట్ల పై చిలుకు షేర్లు కొల్లగొట్టింది. కేవలం, ఆంధ్రప్రదేశ్, నైజాంలో 44 కోట్ల షేర్ రాబట్టింది. చూస్తుంటే, నాన్ బాహుబలి రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. సమ్మర్ సీజన్ అవ్వడం, పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం, సెలెబ్రిటీలంతా మెచ్చుకోవడం రంగస్థలం కి బాగా కలిసొచ్చాయనే చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల మన్ననలు పొందడం పెద్ద అచీవ్మెంట్. రంగస్థలం తో రామ్ చరణ్ ఇంకో కలిసొచ్చిన అంశం ఏంటంటే, ఓవర్సీస్ లో కూడా మార్కెట్ ని పెంచోకోగలిగాడు. ఇప్పటికే 2 మిలియన్ డాలర్ల మైలురాయికి చేరువయిన ఈ సినిమా త్వరలో 3 మిలియన్ డాలర్ల మార్కుని దాటే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చూద్దాం రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు రంగస్థలం బద్దలు కొడుతుందో!

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here