వరుణ్ తేజ్ కి 6 కోట్లు, రామ్ చరణ్ కి 10.25 కోట్లు
on Jun 17, 2017
ఒకప్పుడు సినిమా బిజినెస్ అంటే థియేటర్ల దగ్గర నుండి వచ్చే వసూళ్లు మాత్రమే. కానీ ఈ రోజు సినిమా మార్కెట్ పరిధి విస్తరించింది. డిజిటల్ రైట్స్ అని, ఆడియో రైట్స్ అని, సాటిలైట్ రైట్స్ అని, ఇన్ ఫిలిం బ్రాండింగ్ అని, గేమింగ్ అని... ఒక్కటేమిటి చేసుకున్నవాడికి చేసుకున్నంత అన్నంతగా తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది. ఇక స్టార్ హీరోల సినిమాల పరిస్థితి చెప్పక్కర్లేదు. ఆన్లైన్ బిజినెస్ లో టాప్ ప్లేస్ లో ఉన్నా అమెజాన్ వీడియో స్ట్రీమింగ్ బిజినెస్ లోకి కూడా కాలు మోపింది. వస్తూ వస్తూనే పప్పులో కాలేసింది అది వాళ్ళకి పెద్ద విషయం కాదనుకోండి. కానీ వీడియో స్ట్రీమింగ్ బిజినెస్ లో ఆధిపత్యం చెలాయించేలా పావులు కదుపుతుంది. తెలుగులో మొదటగా వరుణ్ తేజ్ నటించిన మిస్టర్ సినిమాని 6 కోట్లు వెచ్చించి తీసుకున్నారు.
సినిమా డిజాస్టర్ అయినా అమెజాన్ లో మాత్రం బాగానే రెస్పాన్స్ వచ్చింది అంటున్నారు. తమ తదుపరి చిత్రంగా రామ్ చరణ్ రంగస్థలం 1985 ని 10.25 కోట్లు పెట్టి కొన్నారట. వాస్తవానికి, ఇది పెద్ద మొత్తమే అయినప్పటికీ, వరుణ్ తేజ్ సినిమాపై పెట్టిన దానితో పోలిస్తే కాస్త తక్కువే అని చెప్పొచ్చు. ఇవే కాకుండా, తెలుగులో త్వరలో రానున్న స్టార్ హీరోల సినిమాలన్నీ కొనే ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది. ఇది ఒక రకంగా నిర్మాతలకి మంచి చేసే విషయమే. సాటిలైట్ రైట్స్ ని మించి డబ్బులు రావడం నిజంగా నిర్మాతకి అదనపు ఆదాయమే కదా.