Celebrities IPhone App     top news
TMDB - TeluguOne Movie Database, Telugu cinema News, Telugu Movie News, Telugu cinema reviews, latest telugu movies, Telugu Film newsNews, Telugu movies online
తెలుగు సినిమా న్యూస్
   న్యూస్   
రంగం ఆడియో రిలీజ్
Apr 9, 2011  Telugu Cinema News : Like This :

rangam wallpapers, rangam sstills, rangam pics, rangam images, rangam photos, rangam pictures సూపర్ గుడ్ ఫిలింస్ మరియూ ఆర్.యస్.ఇన్ఫోటైన్ మెంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై, జీవా, అజ్మల్ అమీర్ హీరోలుగా, కార్తీక, పియా బాజ్ పాయ్ హీరోయిన్లుగా, కె.వి.దర్శకత్వంలో, కుమార్, జయరామ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం"రంగం".ఈ "రంగం" చిత్రానికి "కింగ్ మేకర్" అన్న క్యాప్షన్ ని పెట్టారు. ఈ "రంగం" చిత్రాన్ని తెలుగులో "రంగం" పేరుతో తమిళంలో "కెవొ" పేరుతో కూడా ఒకేసారి నిర్మిస్తున్నారు. ఈ "రంగం" చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు హేరీస్ జైరాజ్ సంగీతాన్నందిస్తున్నారు.

 

ఈ "రంగం" చిత్రం యొక్క ఆడియో తొలి సి.డి.ని ప్రముఖ దర్శకులు వినాయక్ ఆవిష్కరించి, తొలి సి.డి.ని ప్రముఖ నిర్మాత సురేష్ బాబుకి అందించగా, ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేయబడింది. ఈ ఆడియో విడుదలకు హీరోలు జీవా, అజ్మల్ అమీర్, హీరోయిన్లు కార్తీక్, పియా బాజ్ పాయ్, దర్శకుడు కె.వి.ఆనంద్, పాటల రచయిత వనమాలి, వినాయక్, సురేష్ బాబు, కార్తీక తల్లి, సీనియర్ హీరోయిన్ రాధ, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్, సంగీత దర్శకులు హేరీస్ జైరాజ్, ఈ చిత్ర సమర్పకులు, సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత, హీరో జీవా తండ్రి అయిన ఆర్.బి.చౌదరి తదితరులు హాజరయ్యారు.

 

ఈ చిత్ర దర్శకులు కె.వి.ఆనంద్‍ పూర్వాశ్రమంలో ఫొటో జర్నలిస్ట్ అవటం వలన ఆ అభిమానం చంపుకోలేక ఇక్కడకు విచ్చేసిన ఫొటో జర్నలిస్టులందరినీ వేదికపైకి పిలిచి వారికి ఈ చిత్రం ఆడియో సి.డి.ని అందజేశారు.

 
<<   అల్లు శిరీష్ ట్విట్టర్ కాంట్రొవర్సీ పవన్ కళ్యాణ్ ది షాడో లోఅడవి శేషు   >>
Be the first one to post comment.