చంద్రబాబుగా రానా.. అదరగొట్టేసాడుగా.!!
on Sep 7, 2018
స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు జీవిత్ర చరిత్ర ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.. బాలకృష్ణ కథానాయకుడిగా భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి.. తాజాగా లీక్ అయిన రానా ఫోటో సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది.. ఈ సినిమాలో రానా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. తొలి సినిమా 'లీడర్' లోనే సీఎం గా నటించి మెప్పించిన రానా.. సీఎం చంద్రబాబు పాత్రలో ఎలా ఉంటాడు? ఎలా మెప్పిస్తాడు? అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. అయితే రీసెంట్ గా లీకైన ఫోటో ఆ ఆసక్తిని ఆనందంగా మారుస్తుంది.. వైట్ అండ్ వైట్ లో రానా నాటి చంద్రబాబుని గుర్తు చేస్తున్నారు.. ఈ ఫోటోని చూసిన వారు నారా వారి లుక్ లో రానా అదరగొట్టేసాడుగా అంటూ ప్రశంసిస్తున్నారు.. ఒక్క ఫొటోతోనే ఇంతలా ఆకట్టుకున్న రానా, ఇక సినిమాలో ఎంతలా మెప్పిస్తాడో చూడాలి.