పెళ్లి వేడుకలో రానా కరోనా సందేశం
on Aug 7, 2020
పెళ్లి వేడుకలలో ప్రజలకు రానా దగ్గుబాటి కరోనా సందేశం ఇచ్చారు. కొవిడ్-19 వైరస్ మహమ్మారి కోరలు చాచి రోజు రోజుకీ విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని అటు ప్రభుత్వాలు, ఇటు ప్రముఖులు చెబుతున్నారు. రానా సైతం తన చేతల ద్వారా అదే చెప్పారు. మెహందీ వేడుకలలో మాస్క్ వేసుకుని ఆయన కనిపించారు.
రానా పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు తప్ప బయట వ్యక్తులు ఎవరూ హాజరు కావడం లేదు. అందరూ తమవాళ్లే అయినప్పటికీ అలసత్వం ప్రదర్శించరాదని మాస్క్ వేసుకోవడం ద్వారా రానా చెప్పినట్టు అయ్యింది. ఈ వేడుకల్లో సమంత స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. రానాకు ఆమె సోదరి వరుస అన్న సంగతి తెలిసిందే. రానా మేనత్త కొడుకు, బావ నాగచైతన్యకు సమంత శ్రీమతి కదా మరి.
మెహందీ వేడుకలో రానాకు కాబోయే శ్రీమతి మెహీకా బజాజ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. పింక్ కలర్ డ్రస్ లో రాణీలా ఉన్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.