ENGLISH | TELUGU  

రానాకు ఆరోగ్య సమస్యలు... నిజమే 

on Jan 16, 2020

దగ్గుబాటి రానాకు ఆరోగ్యం బాలేదు. అందుకని, చికిత్స కోసం అమెరికా వెళ్లాడని తెలుగు మీడియా ఎప్పుడో చెప్పింది. వీటిని దగ్గుబాటి ఫ్యామిలీ ఖండించింది. 'విరాట పర్వం'లో మావోయిస్ట్ క్యారెక్టర్ కోసం బరువు తగ్గి, సన్నగా కావడం కోసం రానా అమెరికా వెళ్లాడని రామానాయుడు కాంపౌండ్ సన్నిహిత వర్గాల నుండి అందిన సమాచారం. ఓ హిందీ సినిమా యూనిట్ రానాకు ఆరోగ్య సమస్యలున్న మాట నిజమేనని చెబుతోంది.

అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న హిందీ సినిమా 'భుజ్'. ది ప్రైడ్ ఆఫ్ ఇండియా అనేది ఉపశీర్షిక. 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో గుజరాత్‌లోని భుజ్ ఎయిర్‌పోర్ట్ రన్‌వేని పాక్ సైన్యం నాశనం చేస్తుంది. అక్కడ విమానాలు దిగడం కష్టమవుతుంది. స్థానిక మహిళలతో కలిసి ఒక ఐఏఎఫ్ అధికారి  రన్‌వేని పునరుద్ధరిస్తాడు. ఇదీ 'భుజ్' కథానేపథ్యం. ఇందులో ఒక ప్రధాన పాత్రకు దగ్గుబాటి రానాను తీసుకున్నారు. కానీ, అతడు ఈ సినిమా చేయడం లేదు. అతని స్థానంలో 'సర్దార్ గబ్బర్ సింగ్'లో విలన్ పాత్ర పోషించిన శరద్ కేల్కర్ చేస్తున్నారు. 

ఆరోగ్య సమస్యలతో పాటు డేట్స్ అడ్జస్ట్ చేయలేని కారణంగా 'భుజ్' నుండి రానా తప్పుకున్నట్టు హిందీ మీడియా పేర్కొంటోంది. శరద్ కేల్కర్ కూడా రానా ఆరోగ్యం బాలేదని చెబుతున్నాడు. "భుజ్ సినిమాలో చాలా యాక్షన్ పార్ట్ ఉంది. రానా కోలుకోవడానికి మరికొన్ని నెలలు పట్టేలా ఉంది. అందుకని, ఆ రోల్ నాకు ఆఫర్ చేశారు" అని శరద్ కేల్కర్ చెప్పాడు.

Rana Daggubati Walks Out of Ajay Devgn Bhuj, Rana Daggubati, Ajay Devgn Bhuj, Rana Daggubati QUITS Ajay Devgn starrer Bhuj, Bhuj The Pride of India, bhuj movie 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.