మరోసారి పోలీస్ పాత్రలో రామ్ చరణ్ !!!
on Feb 11, 2019
`తుఫాన్` , `ధ్రువ` చిత్రాల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అలరించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మరోసారి ఈ స్టార్ హీరో పోలిస్ పాత్రలో కనిపించనున్నాడని టాలీవుడ్ టాక్. అయితే ఈ సారి పిరియాడిక్ టచ్ ఉండడమే ఆ పాత్ర ప్రత్యేకత. కాస్త వివరాల్లోకి వెళితే దర్శకధీరుడు రాజమౌళ దర్శకత్వంలో రూపొందుతున్న మాసివ్ మల్టీ స్టారర్ `ఆర్ ఆర్ఆర్` లో యంగ్ టైగర్ యన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనే చరణ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు.
వినిపిస్తున్న కథానాల ప్రకారం రెండు డిఫరెంట్ టైమ్ లైన్స్ లో నడిచే ఈ సినిమాలో 1920ల కాలం నాటి కథతో పాటు 2020ల కాలం నాటి కథ కూడా మిక్స్ అయి ఉంటుందని తెలుస్తోంది. 1920 లో బ్రిటీష్ ప్రభుత్వం టైమ్ లో వచ్చే ఎపిసోడ్స్ లో రామ్ చరణ్ పోలీస్ అధికారి రామరాజు పాత్రలో కనిపిస్తాడు. ఇటీవలే ఆ సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ జరిగిందని పమాచారం. పోలీస్ చెక్ పోస్ట్ నేపథ్యంలో సాగే ఈ సన్నివేశాలు అలరించేలా ఉంటాయని టాక్.
డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం . 2020 వేసవిలో విడుదల కానుంది. మరి రామరాజు పాత్రలో రామ్ చరణ్ ఏ స్థాయిలో అలరిస్తాడో తెలియాలంటే అప్పటివరకు వేచి చూడాల్సిందే.