ఆర్ఎక్స్ 100 డైరెక్టర్.. రామ్, దుల్కర్ మల్టీస్టారర్.!!
on Sep 17, 2018
రీసెంట్ గా 'ఆర్ఎక్స్ 100' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి త్వరలో రామ్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం 'హలో గురు ప్రేమకోసమే' సినిమాతో బిజీగా ఉన్న రామ్ ఈ సినిమా అనంతరం అజయ్ తో కలిసి పనిచేయబోతున్నట్టు సమాచారం.. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది.. ఇది మల్టీ స్టారర్ సినిమా.. ఈ సినిమాలో మరో హీరోగా మలయాళం యాక్టర్ దుల్కర్ సల్మాన్ కూడా నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ ఈ మల్టీ స్టారర్ తో మరింత దగ్గరవుతాడేమో చూడాలి.. ఈ మల్టీ స్టారర్ గురించి వార్తలు మొదలయ్యాయో లేదో అప్పుడే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది.. చూద్దాం మరి ఈ మల్టీ స్టారర్ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో.