వర్మ... మీ సరసాలు పాడుగాను!
on Aug 10, 2020
రామ్ గోపాల్ వర్మకి జ్వరం వచ్చిందని ఒకట్రెండు వెబ్సైట్లు (తెలుగువన్.కామ్ కాదు) రాశాయి. వర్మకి వైరల్ ఫీవర్ రాగా అనుమానంతో కొవిడ్19 టెస్ట్ చేయించారనీ, నెగిటివ్ రిజల్ట్ వచ్చిందనీ, రెండు మూడు రోజుల్లో జ్వరం తగ్గుతుందని డాక్టర్లు చెప్పారనీ సదరు రాతల సారాంశం. జ్వరం రావడంతో ఆర్జీవీ టీమ్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిందన్నారు. అయితే, తనపై రాసిన రాతలపై వర్మ వివరణ ఇచ్చారు.
డంబుల్తో ఎక్సరసైజ్ చేస్తున్న వర్మ ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో తనపై వచ్చిన పుకార్లను ఖండించారు. తాను సూపర్ ఫిట్‌గా, ఫైన్‌గా ఉన్నట్టు ట్వీట్ చేశారు. దానికి 'థ్రిల్లర్', 'డేంజరస్' సినిమాల్లో నటిస్తున్న అప్సరా రాణి స్పందన, వర్మ ప్రతిస్పందన ఆసక్తికరంగా ఉన్నాయి.
"సార్... మీరు చాలా స్ట్రాంగ్. మీ బైసెప్స్ చాలా బాగున్నాయి" అని వర్మకు అప్సర కాంప్లిమెంట్ ఇచ్చింది. "నా బైసెప్స్ గురించి మర్చిపో. నీ శరీరంలో ప్రతి భాగాన్ని నువ్వు ఎక్స్పోజ్ చేసిన విధానం ఫెంటాస్టిక్. దుస్తులు కవర్ చేసిన భాగాలు ఎంత అందంగా ఉంటాయో నేను ఊహించుకోలేను" అని వర్మ రిప్లై ఇచ్చారు. దానికి ఆమె అందాలపై ఆయన కన్ను పడిందని కామెంట్లు వచ్చాయు. ఒకరు 'మీ సరసాలు పాడుగాను' అని కామెంట్ చేశారు. అప్సర మాత్రం అందుకు మహిళలను సృష్టించిన భగవంతుడికి థాంక్స్ చెప్పాలని వర్మకి సూచించింది.
ఆర్జీవీ కొత్త సినిమా 'డేంజరస్'లో నైనా గంగూలీతో కలిసి అప్సర లెస్బియన్ గా నటించింది. దీన్ని ఇండియాస్ ఫస్ట్ లెస్బియన్ క్రైమ్ యాక్షన్ ఫిలింగా వర్మ పేర్కొన్నారు.
Also Read