చరణ్ కు గాయాలు...ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ బ్రేక్!!
on Apr 3, 2019
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం `ఆర్ఆర్ ఆర్`. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పూణేలో జరుగుతోంది. అయితే జిమ్ లో కసరత్తులు చేస్తోన్న రామ్ చరణ్ గాయపడటంతో షూటింగ్ వాయిదాపడింది. దీంతో షూటింగ్ వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. తిరిగి మళ్లీ మూడు వారాల తర్వాత షూటింగ్ ప్రారంభం కానుంది. డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, డైసీ ఎడ్గర్ , అజయ్ దేవ్ గన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను 2020 లో రిలీజ్ చేయనున్నారు.