1920 కాలం నాటి సెట్లో చెర్రీ, అలియా
on Mar 8, 2021
వాస్తవ పాత్రలు, కల్పిత ఘట్టాలతో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న పాన్ - ఇండియా మూవీ `ఆర్ ఆర్ ఆర్`. అల్లూరి సీతారామరాజుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కొమురం భీమ్ గా యంగ్ టైగర్ యన్టీఆర్ నటిస్తున్న ఈ పిరియడ్ డ్రామా.. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే ఓ డ్యూయెట్ ని పిక్చరైజ్ చేయబోతోందట జక్కన్న అండ్ టీమ్. రామ్ చరణ్, అలియా భట్ మధ్య సాగే ఈ రొమాంటిక్ నంబర్ ని.. 1920 కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్ లో షూట్ చేయనున్నారట. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ తీర్చిదిద్దిన ఈ సెట్.. సినిమాకి ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్న `ఆర్ ఆర్ ఆర్`లో అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. అక్టోబర్ 13న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
Also Read