`ఆర్ ఆర్ ఆర్` కథ విని షాకయ్యాం!!
on Jan 8, 2019
`నేను , తారక్ తొలిసారి `ఆర్ ఆర్ ఆర్` కథ విని షాకయ్యాం. కొద్ది సేపు అలా సెలైంట్ గా ఉండిపోయాం. అంత బాగా నే రేషన్ చేశారు రాజమౌళి గారు. ఇలా కూడా స్టోరీస్ రెడీ చేయవచ్చా? అని అనిపించేలా `ఆర్ ఆర్ ఆర్` స్టోరిని డిజైన్ చేశారు రాజమౌళి గారు. ఒక్కో క్యారక్టర్ ఒక్కో రకంగా ఉంటుంది. డి గ్లామరైజ్డ్ క్యారక్టర్ నాది. ఆడియన్స్ కనెక్టయ్యేలా ఉంటుంది. ఆడియన్స్ తో పాటు నేను ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను.
ఎప్పటి నుంచో తారక్ , నేను కలిసి సినిమా చేయాలనుకుంటున్నాం. ఈ సినిమాతో కుదిరింది. తారక్ తో కలిసి నటించడం మంచి అనుభూతి. ఇద్దరి మధ్య సీన్స్ చాలా బాగా వచ్చాయి. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తైంది. చాలా హ్యాపీగా జరిగింది. సంక్రాంతి తర్వాత మరో షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ ఏడాది మొత్తం ఈ సినిమా కోసమే కేటాయించాను.
ఇక `వినయ విధేయ రామ` లో రామ్ క్యారక్టర్ లో నటించాను. ప్రతి ఇంట్లో ఇలాంటి వాడు ఒకడు ఉండాలి అని అనుకునేలా నా క్యారక్టర్ ఉంటుంది. రాముడు తరహాలోవినయంగా ఉంటూ అవసరమైతే విధ్వంసం కూడా సృష్టించే టైప్ లో నా క్యారక్టర్ డిజైన్ చేశాడు దర్శకుడు.