విలన్గా నిజమేనా? తారక్, చరణ్ లతో దెబ్బలు తప్పవా?
on Feb 3, 2018
మాస్ సినిమాల్లో విలన్ ఎంత శక్తివంతంగా ఉంటే.... హీరో పాత్ర అంత ఎలివేట్ అవుతుంది. ఇది కమర్షియల్ ఫార్ములా. ఈ ఫార్ములాతో తీసిన ప్రతి సినిమా హిట్టే. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి... తన సినిమాల్లో తప్పకుండా ఈ సూత్రాన్ని పాటిస్తాడు. త్వరలో ఆయన చేయనున్న క్రేజీ మల్టీస్టారర్లో ఈ ఫార్ములానే హైలైట్ కానుదని తెలుస్తోంది. వివరాల్లోకెళ్తే... ఎన్టీయార్, చరణ్ కలిసి నటించే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం మరో స్టార్ హీరోని సెట్ చేశాడట దర్శక ధీరుడు. ఆ స్టార్ ఎవరో కాదు... మాస్ మహారాజా రవితేజ. అవును... రాజమౌళి మల్టీస్టారర్ లో రవితేజ విలన్ గా నటిస్తున్నాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. రవితేజకు కథ కూడా వినిపించేశాడట రాజమౌళి. విలన్ పాత్ర అత్యంత శక్తివంతగా ఉండటంతో మాస్ మహారాజా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట! విలన్ గా చేయడం రవితేజకు కొత్త విషయం కాదు. విలన్ పాత్రలతోనే రవితేజ కెరీర్ మొదలైంది. తొలినాళ్లలో చాలా సినిమాల్లో నెగిటీవ్ కేరక్టర్లు చేశాడు రవి. మళ్లీ ఇన్నాళ్లకు రాజమౌళి పుణ్యమా అని విలన్ అవతారం ఎత్తనున్నాడన్నమాట.
బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఎన్టీయార్, చరణ్ అన్నదమ్ములుగా ..బాక్సర్లుగా కనిపిస్తారు. రవితేజ ఇందులో విలన్ గా చేయడం నిజమే అయితే.. ఆ పాత్రను దర్శకధీరుడు ఎలా డిజైన్ చేశాడో..