ఆర్జీవీ తాతయ్య గారికి అంటూ రాజమౌళి ట్వీట్...
on Feb 10, 2020
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను దర్శక ధీరుడు రాజమౌళి అభినందించారు. 'వర్మ సినిమాలు ఏవీ ఈ వారంలో విడుదల కాలేదు. మొన్నామధ్య విడుదలైనవి భారీ విజయాలేమీ సాధించలేదు. నిన్న మొన్నల్లో వర్మకు అవార్డులు కూడా ఏవీ రాలేదు. మరి, రాజమౌళి ఎందుకు అభినందించినట్టు?' అని ఆలోచిస్తున్నారా? సినిమాల్లో వర్మ సాధించిన ఘనతలకు రాజమౌళి అభినదించలేదు. వర్మ వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలకు అభినందించారు.
"కాంగ్రాచ్యులేషన్స్ రాము (రామ్ గోపాల్ వర్మ) తాతయ్యగారు... మీకు కళ్లెం వేసే వ్యక్తి, మీ మనవరాలు అవ్వాలని ఆశిస్తున్నా. నాకు ఓ సందేహం... రాము తాత, రాము నాన్న లేదంటే గ్రాండ్ పా రాము - మీరు ఎలా పిలిపించుకోవాలని అనుకుంటున్నారు?" అని రాజమౌళి ట్వీట్ చేశారు. ఇప్పుడు మీకు అర్థమయింది కదూ! రామ్ గోపాల్ వర్మ తాతయ్య అయ్యారని.
రామ్ గోపాల్ వర్మకు ఒక కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. ఆమె డాక్టర్. పేరు రేవతి. పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆదివారం అమెరికాలో రేవతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.