'ఆర్ఎక్స్100' భామతో బెల్లంకొండ ఐటమ్...!
on Sep 15, 2018
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించే సినిమాల్లో ఓ ఫార్ములా వుంటుంది. అదేంటంటే... ఓ స్టార్ హీరోయిన్ సినిమాలో అతడి పక్కన నటిస్తే, మరో స్టార్ హీరోయిన్ లేదా క్రేజీ హీరోయిన్ చేత ఐటమ్ సాంగ్ చేయించడం! ఈ యేడాది విడుదలైన 'సాక్ష్యం'ను మినహాయిస్తే అంతకు ముందు సినిమాలకు అతడు సేమ్ ఫార్ములాను అనుసరించాడు. కావాలంటే ఓ లుక్కేయండి!
'అల్లుడు శీను'లో సమంత హీరోయిన్. అందులో ఇంకో స్టార్ హీరోయినూ వున్నారు. ఆమె తమన్నా. ఐటమ్ సాంగులో ఆమెతో కలిసి హాట్ హాట్ స్టెప్పులేశాడు బెల్లంకొండ. 'స్పీడున్నోడు'లో సోనారిక హీరోయిన్. 'జాదూగాడు'లో అందాల ఆరబోతతో యువతలో ఆమెకు పేరొచ్చింది. హీరోయిన్గా ఆమె నటిస్తే... మరోసారి తమన్నాతో ఐటమ్ సాంగులో స్టెప్పులేశాడు. 'జయ జానకి నాయక'లో రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్. ప్రగ్యా జైస్వాల్ సెకండ్ హీరోయిన్. అందులో కేథరిన్ చేత ఐటమ్ సాంగ్ చేయించాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకూ సేమ్ ఫార్ములాను అప్లై చేస్తున్నాడని టాక్. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. లేటెస్ట్ సెన్సేషన్ 'ఆర్ఎక్స్100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌తో ఐటమ్ సాంగులో స్టెప్పులు వేయనున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. దర్శకుడు తేజకు, పాయల్ రాజ్‌పుత్‌కి మధ్య డిస్కషన్ కూడా జరిగిందట. ఈ పాట సినిమాకు మెయిన్ అట్రాక్షన్ అవుతుందట!!