`ఆర్ ఆర్ ఆర్` `కొత్త షెడ్యూల్ కు అంతా సిద్ధం!!
on May 17, 2019
రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు ఇద్దరికీ చిన్నపాటి గాయాలు అవడంతో రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్` షూటింగ్ కు కొంత కాలం ఆపేసిన సంగతి తెలిసిందే. ఇప్పటిఏ ఈ సినిమాకు సంబంధించిన రెండు భారీ షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసాడు రాజమౌళి. ఇక తదుపరి షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తోందట చిత్ర యూనిట్. రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు పూర్తిగా క్యూర్ అవడడంతో కొత్త షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. మే 20 న ఎన్టీఆర్ బర్త్ డే. ఆ మరుసటి రోజు అంటే మే 21 నుంచి ఈ సినిమా షెడ్యూల్ అల్యూమీనియంలో ఫ్యాక్టరీలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో అలియాభట్ కూడా పాల్గొనే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దాదాపు 350 కోట్లతో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా సెంథిల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 2020 జూలై 30 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ కొత్త షెడ్యూల్ ప్రారంభించుకోనుందని తెలిసి అభిమానలు ఆనందంలో మునిగిపోయారు.