English | Telugu

RRR లో బాలీవుడ్ భామలా??

on Jan 11, 2019


        

`బాహుబ‌లి` సిరీష్ తో నేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అయిపోయాడు ద‌ర్శ‌క‌ధీకుడు రాజ‌మౌళి. ప్ర‌స్తుతం ఈ మోస్ట్ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్. యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు తెర‌పై చాలా కాలం తరువాత వ‌స్తున్న సిస‌లైన మ‌ల్టీస్టార‌ర్ కావ‌డంతో  ఈ భారీ బ‌డ్జెట్ మూవీపై స‌ర్వ‌త్రా మంచి  అంచ‌నాలే ఉన్నాయి. కేవ‌లం తెలుగులోనూ కాకుండా ఇత‌ర భాష‌ల్లోను ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ ఆర్ఆర్` (వ‌ర్కింగ్ టైటిల్) ఫిబ్ర‌వ‌రి నుంచి రెండో షెడ్యూల్ జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే.. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమాలో న‌టించే క‌థానాయిక‌ల గురంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం య‌న్టీఆర్ , రామ్ చ‌ర‌ణ్ రేంజ్ కు త‌గ్గ హీరోయిన్ల‌ను అన్వేషించే ప‌నిలో ఉన్నార‌ట రాజ‌మౌళి. ఇద్ద‌రు బాలీవుడ్ భామ‌ల‌తో పాటు కొంత‌మంది ద‌క్షిణాది తార‌ల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయ‌ని  త్వ‌ర‌లోనే క‌థానాయిక‌ల ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని స‌మాచారం. మ‌రి ఆ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగ‌క‌త‌ప్ప‌దు అన్న‌మాట‌. ప్ర‌ముఖ నిర్మాత డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ క్రేజీయ‌స్ట్ ప్రాజెక్ట ..2020 లో తెర‌పైకి రానుంది.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here