English | Telugu

చంద్రబాబును మార్చేసిన వర్మ

on Sep 6, 2019

 

వివాదాలే రామ్‌గోపాల్‌ వర్మకు ఆక్సిజన్‌, అన్నం, మజ్జిగ వగైరా వగైరా! కథ, కథనం, దర్శకత్వం కంటే వార్తల్లో ఎలా ఉండాలి బాగా తెలిసిన వ్యక్తి. ఎప్పటికప్పుడు సంచలనాలతో సోషల్‌ మీడియాలో సెగలు పుట్టించే వర్మ, మరోసారి చంద్రబాబు అభిమానులకు, తెలుగుదేశం పార్టీ వర్గాలకు ఆగ్రహం తెప్పించారు. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ అని రాజకీయ వివాదాస్పద చిత్రాన్ని వర్మ తీస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చంద్రబాబు పాత్రధారి ఫస్ట్‌ లుక్‌ను ట్విట్టర్‌లో విడుదల చేశారు. ఈ లుక్‌ చూస్తుంటే... ఒకప్పుడు అచ్చంగా ప్రముఖులను పోలిన మనుషులను వెతికి పట్టుకునే వర్మ, ఇప్పుడు డూప్‌లతో కాలం నెట్టుకొస్తున్నట్టుంది. వర్మ విడుదల చేసిన లుక్‌లో చంద్రబాబు పోలికలు లేకపోగా... మరీ వెటకారంగా ఉంది. అంతో ఇంతో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లో చంద్రబాబు పాత్రలో నటించిన వ్యక్తి కొంచెం బెటర్‌. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’లో అతణ్ణి తీసుకోకుండా ఎందుకు మార్చారో మరి?

 

 


Cinema GalleriesLatest News


Video-Gossips