‘ఆర్డిఎక్స్ లవ్’ ట్రైలర్: క్యారెక్టర్ ఉన్న ఆడదాని కథ!
on Sep 10, 2019
ఓ సెక్షన్ ఆడియన్స్‌ను ‘ఆర్డిఎక్స్ లవ్’ ట్రైలర్ డిజప్పాయింట్ చేస్తే... మెజార్టీ ఆడియన్స్‌కు షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఎందుకంటే... ఈ సినిమా టీజర్లో రొమాన్స్‌ను ఫుల్లుగా చూపించారు. పాయల్ రాజ్‌పుత్ అందాలపై ఎక్స్ట్రా ఫోకస్ చేశారు. ‘ఇంట్లో పేరేంట్స్ లేనప్పుడు మన ఇంట్లో ఫీలింగ్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి. తప్పదూ అనుకుంటే సేఫ్టీలైనా అందుబాటులో ఉంచుకోవాలి’ అని ఆమె చేత 18 ప్లస్ ఏ రేటెడ్ డైలాగులు చెప్పించారు. మంచం విరిగినట్టు చూపించారు. ఆ టీజర్ మలయాళం బిగ్రేడ్ సినిమాలా ఉందంటూ కామెంట్స్ వచ్చాయి. వాటి ఫలితమో... మరొకటో... అందుకు భిన్నంగా ట్రైలర్ కట్ చేశారు. టీజర్లో ఫుల్ రొమాన్స్ అంటే... ట్రైలర్ అందుకు రివర్స్‌లో ఉంది.
ఒక ఊరి సమస్యలను తీర్చడానికి ప్రయత్నించే అమ్మాయిగా పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్‌ను చూపించారు. ఆమె చేత విజయశాంతిలా ఫైట్లు చేయించారు. భారీ భారీ డైలాగులు చెప్పించారు. ‘వేటాడాలనుకున్న ఆడపిల్లకు మగసింహం కూడా కుక్కపిల్లలా కనిపిస్తుంది’ అనే డైలాగ్ ఓవర్ ది బోర్డ్ వెళ్లినట్టుంది. టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్ ఎఫెక్ట్ ఏమో... ‘క్యారెక్టర్ ఉన్న ఆడదాని మాటే అగ్రిమెంట్రా’ అని హీరోయిన్ని ఉద్దేశిస్తూ ఆదిత్య మీనన్ చెప్పిన డైలాగ్‌ను ట్రైలర్లో పొందుపరిచారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేయడం కోసమేమో! టీజర్‌తో ఒక సెక్షన్ ఆడియన్స్‌కు... ట్రైలర్‌తో మరో సెక్షన్ ఆడియన్స్‌కు గాలం వేసి, ప్రేక్షకులను ‘ఆర్డిఎక్స్ లవ్’ ఫిల్మ్‌మేకర్స్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు.
Also Read