Home

»

Latest News

పవన్ చిత్రం స్క్రిప్ట్ పూర్తి చేసిన పూరీ

Feb 15, 2012 10:58AM

పవన్ చిత్రం స్క్రిప్ట్ పూర్తి చేసిన పూరీ జగన్నాథ్ అని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే గతంలో పదకొండేళ్ళ క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, పూరీ జగన్నాథ్ తొలిసారిగా దర్శకుడిగా మారిన చిత్రం "బద్రి". మళ్ళీ వీళ్ళిద్దరి కలయికలో ప్రస్తుతం మరో చిత్రం రానుంది. ఈ చిత్రానికి "కెమెరామేన్ గంగతో రాంబాబు" అన్న పేరుని నిర్ణయించారు. "బంగారం' చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేఖరిగా నటించారు.

మళ్ళీ ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ విలేఖరిగా నటిస్తున్నారు. గత వారంలో విడుదలైన ఈ చిత్రం టైటిల్‍ కి ఇప్పటికే జనంలో విపరీతమైన క్రేజ్ లభించింది. బి.వి.యస్.యస్.రవి (మచ్చా రవి) తన మైక్రో బ్లాగ్ లో పూరీ జగన్నాథ్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ వ్రాయటం ముగించారని తెలిపాడు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com