అల్లు అర్జున్తో మిస్సయ్యాను- ప్రియ ప్రకాష్ వారియర్
on Jan 22, 2019
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘ఒరు ఆడార్ లవ్ ‘ ప్రచార చిత్రంలో కొంటెగా కంటి సైగతో మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అంతేకాకుండా 2018లో గూగుల్లో టాప్ ట్రెండింగ్లో ఒకరిగా ఓ ఘనతను సాధించింది. `ఒరు ఆడార్ లవ్`లో కేవలం 27 సెకన్ల పాటు ఆమె చేసిన కనుసైగకు రెండు రోజుల్లోనే 45 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పటికి రెండు కోట్ల మంది ఆ వీడియో చూశారు. దీంతో సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ర్టీల నుంచి ప్రియా ప్రకాష్ కు బోలెడు సినిమా ఆఫర్స్ వచ్చాయి. మలయాళంలో మంచి పాపులారిటీ ఉన్న అల్లు అర్జున్ నటించిన `నా పేరు సూర్య` చిత్రం కోసం ప్రియా వారియర్ సంప్రదించారు. `లవర్స్ డే` సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ప్రియ మీడియాతో మట్లాడుతూ...`` తెలుగు నుంచి అల్లు అర్జున్ తో నటించడానికి అవకాశం వచ్చింది కానీ, అప్పుడు ఇంకా ఒరు ఆడార్ లవ్ చిత్రం ప్రారంభం కూడా కాలేదు. అందుకే అల్లు అర్జున్ తో ఆ సినిమా మిస్సయ్యాను. అప్పుడు మిస్సైన ఇప్పుడు తెలుగులో `లవర్స్ డే` గా విడుదలవుతోన్న మా సినిమాకు అల్లు అర్జున్ గారు గెస్ట్ గా రావడం చాలా హ్యాపీగా ఉందంటూ చెప్పుకొచ్చింది ప్రియా వారియర్.