మ్యూజికల్ హిట్ `ప్రేమ కావాలి`కి పదేళ్ళు
on Feb 25, 2021
తెలుగునాట వరుస విజయాలతో అలరించిన దర్శకుల్లో కె. విజయ భాస్కర్ ఒకరు. `స్వయంవరం`, `నువ్వే కావాలి`, `నువ్వు నాకు నచ్చావ్`, `మన్మథుడు`, `మల్లీశ్వరి`.. ఇలా మరపురాని ఐదు వరుస విజయాలతో కొన్నేళ్ళ క్రితం సంచలనం సృష్టించారాయన. ఆ తరువాత ట్రాక్ తప్పిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ స్పెషలిస్ట్ ని మళ్ళీ లైమ్ లైట్ లోకి తీసుకువచ్చిన చిత్రం.. `ప్రేమ కావాలి`. సాయికుమార్ తనయుడు ఆది, ఇషాచావ్లాని హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. కె. విజయ భాస్కర్ రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంతోనే సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కెరీర్ లో తొలి బ్రేక్ అందుకున్నారు. `చిరునవ్వే విసిరావే`, `మనసంతా ముక్కలు చేసి`, `తొలకరి చినుకై`, `నువ్వే నువ్వే`.. ఇలా ఇందులోని పాటలన్నీ అప్పట్లో యువతరాన్ని ఉర్రూతలూగించాయి. కె. అచ్చిరెడ్డి నిర్మాణంలో 2011 ఫిబ్రవరి 25న విడుదలై విజయం సాధించిన `ప్రేమ కావాలి`.. నేటితో పదేళ్ళను పూర్తిచేసుకుంటోంది.