నాగబాబు లేకున్నా... జబర్దస్త్‌కి మెగా మేనల్లుడు
on Dec 7, 2019
మెగా బ్రదర్ నాగబాబు పేరుకు ముందు ‘నవ్వులు’ తీసుకొచ్చింది ‘జబర్దస్త్’ కామెడీ షో. ఈ బుల్లితెర కార్యక్రమం ద్వారా నువ్వుకుంటున్న జనాల సంఖ్య ఎక్కువే. ఈ షో ద్వారా నాగబాబు కాస్తా ‘నవ్వుల’ నాగబాబు అయ్యారు. మల్లెమాల సంస్థకు, నాగబాబుకు ఎక్కడ చెడిందో... ఆయన షో నుండి తప్పుకున్నారు. కానీ, షోతో ‘మెగా’ బంధం మాత్రం కొనసాగుతోంది.
జబర్దస్త్ నుండి నాగబాబు నిష్క్రమణ తర్వాత... షోపై ఎఫెక్ట్ ఉంటుందని కొందరు, ఏం ఉండదని మరికొందరు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు ప్లేస్‌లో జడ్జ్ కింద మరొకరు ఇంకా రాలేదు కానీ... ఎవరో ఒకరితో పని కానిస్తున్నారు. ఒక ఎపిసోడ్‌కు రోజా సోలో జడ్జ్‌గా వ్యవహరించారు. తర్వాత నుండి ఎక్ట్సా జబర్దస్త్‌కు అలీ వచ్చారు. జబర్దస్త్‌కు దగ్గరలో రిలీజులు ఉన్న సినిమా హీరోలతో చేస్తున్నారు. ‘అర్జున్ సురవరం’ విడుదలకు ముందు ఎక్ట్సా జబర్దస్త్‌కు నిఖిల్ వచ్చాడు. ‘90ఎంఎల్’ విడుదలకు ముందు జబర్దస్త్‌కు కార్తికేయ వచ్చాడు.
వచ్చే వారం మెగా మేనల్లుడు సాయితేజ్ జబర్దస్త్‌లో సందడి చేయనున్నాడు. ‘ప్రతిరోజూ పండగే’ ఈ నెల 20న విడుదల కానున్న సందర్భంగా సినిమా ప్రమోషన్ కోసం జబర్దస్త్‌కి అతిథిగా వస్తున్నాడు. ఆల్రెడీ ప్రోమో రిలీజైంది. మావయ్య నాగబాబు షో నుండి వచ్చేసినా అతడు వెళ్లడం విశేషమే. అంతకు ముందు నాగబాబు జడ్జ్‌గా ఉన్నప్పుడు షోకి వెళ్లాడు. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఉండడంతో చర్చనీయాంశం అవుతోంది.