అఖిల్‌తో 'అ!' దర్శకుడు?
on Jun 4, 2019
దర్శకుడిగా తొలి సినిమా 'అ!'తో ఇండస్ట్రీ ప్రముఖులు, ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమా తర్వాత అతడికి చాలా అవకాశాలు వచ్చాయి. స్టార్స్ నుంచి పిలుపులు వచ్చాయి. అయితే... 'గరుడవేగ'తో హిట్ కొట్టిన రాజశేఖర్‌తో 'కల్కి' స్టార్ట్ చేశాడు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా తరవాత అక్కినేని అఖిల్‌తో సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నారని టాక్. 'మిస్టర్ మజ్ను' తరవాత కొంత విరామం తీసుకున్న అఖిల్, ఇటీవల 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. ఆ సినిమా తరవాత ప్రశాంత్ వర్మతో సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడట. ప్రస్తుతం ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. చాలా మీటింగ్స్ జరిగాయి. అన్నీ కుదిరితే ఈ ఏడాదే సినిమా పట్టాలు ఎక్కుతుంది. వచ్చే ఏడాది విడుదలవుతుంది.
Also Read