సొంతంగా మేకప్ వేసుకున్న హీరోయిన్
on Oct 17, 2020
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గుర్తుందా? తెలుగులో చాలా అంటే చాలా సినిమాలు చేసింది. అయితే... క్రిష్ దర్శకత్వంలో వచ్చిన 'కంచె' సినిమా ఆమెకు కేరాఫ్ అడ్రస్ అయింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 'ఓం నమో వెంకటేశాయ'లోనూ ఆమెకు మంచి పాత్ర దక్కింది.
తెలుగులో ప్రగ్యా జైస్వాల్ సినిమాలు చేసి రెండేళ్లు అవుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలేవీ ఉన్నట్టు లేవు. అయితే... ఓ చిత్రీకరణ కోసం సొంతంగా మేకప్ వేసుకున్నట్టు ప్రగ్యా జైస్వాల్ తెలిపింది. బహుశా... ఏదైనా యాడ్ షూటింగ్ చేస్తున్నారేమో! లాక్ డౌన్ వల్ల తప్పడం లేదని అన్నారు. అయితే... సొంతంగా హెయిర్ స్టైలింగ్ చేసుకోవడం రాలేదని కూడా ప్రగ్యా జైస్వాల్ చెప్పుకొచ్చారు. అందుకు దగ్గరలో ఉన్న స్టూడియోకి వెళ్లారట.
Also Read