డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ప్రభాష్
on Mar 26, 2019
`మిర్చి` , బాహుబలి` -ది బిగినింగ్` , బాహుబలి -ది కంక్లూజన్` చిత్రాలతో హ్యట్రిక్ విజయాలను అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాష్. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే . సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న `సాహో` ఈ ఏడాది ఆగష్టు 15న విడుదల కానుంది. ఇక `జిల్' రాధాకృష్ణ రూపొందిస్తున్న పిరియాడికల్ లవ్ స్టోరీ వచ్చే ఏడాది ఆరంభంలో తెరపైకి రానుంది.
`జిల్` రాధాకృష్ణ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే ఇందులో ప్రభాష్ రెండు విభిన్న పాత్రలో దర్శనమివ్వనున్నాడుట. ఒక పాత్ర సిన్సియర్ లవర్ కాగా , మరొకటి ప్లే బాయ్ తరహా పాత్ర అని టాలీవుడ్ టాక్. మొదటి పాత్రకి సంబంధించిన సన్నివేశాలన్నీ వింటేజ్ యూరప్ నేపథ్యంలో సాగుతాయని ఈ పాత్రకి జోడీగా పూజా హెగ్డే కనిపిస్తుందని, రెండో పాత్రకి సంబంధించిన సన్నివేశాలన్నీ ఇండియా నేపథ్యంలో ఉంటాయని , ఈ క్యరెక్టర్ కి జోడీగా కాజల్ నటిస్తోందని సమాచారం. మరి ఈ వార్త లో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది.