పుట్టిన రోజున బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వనున్న ప్రభాస్!!
on Oct 19, 2018
`బాహుబలి` చిత్రంతో ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో ఫేమస్సయ్యాడు ప్రభాస్. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అంటే ప్రభాస్ అని చెప్పాలి. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? ఏంటి? ఎవరిని చేసుకుంటాడు? అంటూ ఇటు సినిమా ఇండస్ట్రీలో అటు ఆయన అభిమానుల్లో పలు సందేహాలు ఎప్పడెప్పటి నుంచో మెదులుతున్నాయి. ఈనెల 23న వాటిన్నింటికీ ఫుల్ స్టాప్ పడనున్నట్లు తెలుస్తోంది. రెండు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న ప్రభాస్ ఈ నెల 23న ఒక సర్ ప్రైజింగ్ న్యూస్ చెబుతాను అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. దీంతో ఆ రోజు ప్రభాస్ చెప్పే ఆసక్తికరమైన న్యూస్ తన పెళ్ళికి సంబంధించినదే అన్న ఊహాగానాలొస్తున్నాయి.
అయితే ఆయన సన్నిహిత వర్గాల వారు చెప్పే దాన్ని బట్టి గుంటూరు కు చెందిన అమ్మాయితో ప్రభాస్ పెళ్లి డిసైడయ్యిందట. ఆ అమ్మాయి ప్రభాస్ కు దూరం రిలేషన్ కానుందట. ఇరు కుటుంబాల వారు ఇటీవల మాట్లాడుతకోని పెళ్లి ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఎంగేజ్ మెంట్ , మ్యారేజ్ ఎప్పుడనేది తెలియకపోయినా...ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా కచ్చితంగా ప్రభాస్ పెళ్లి ప్రకటన రానుందట. ఎట్టకేలకు ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడన్నమాట.