ఆగకుండా కిలోమీటర్ పరుగు తీసిన ప్రభాస్
on Mar 12, 2020
కిలోమీటర్ నడవడం సులభమే. అదే ఉన్నట్టుండి ఆగకుండా కిలోమీటర్ పరుగు తీయమని అడిగితే కొంచెం కష్టమే. అయితే... అక్కడ ఉన్నది ఎవరు? ప్రభాస్! భారతీయ బాహుబలి!! అలవోకగా, అవలీలగా కిలోమీటర్ పరుగు తీశాడు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న 20వ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం జార్జియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల అక్కడ ఒక క్యూట్ చేజింగ్ సీక్వెన్స్ షూట్ చేశాము అని దర్శకుడు రాధా కృష్ణ, నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ ప్రతినిధులు ట్వీట్ చేశారు. ఆ చేజింగ్ సీక్వెన్స్ లో ప్రభాస్ రన్నింగ్ హైలైట్ అవుతుందట. జార్జియాలో ఈ ఫైట్ కోసం స్పెషల్ మార్కెట్ సెట్ ఒకటి వేశారట.
'బాహుబలి'లో యుద్ధాలు, పోరాట ఘట్టాలు అన్ని రాజుల కాలాన్ని కళ్లకు కట్టినట్టు ఆవిష్కరించాయి. చారిత్రక చిత్రంలో పోరాటాలు ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. పీరియాడిక్ ఫిలిం కాబట్టి ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. 'సాహో'లో ఫైట్స్ అన్ని స్టైలిష్ గా తీశారు. మాఫియా బ్యాక్ డ్రాప్ సినిమా కాబట్టి లార్జర్ దేన్ లైఫ్ ఫైట్స్ డిజైన్ చేశారు. ప్రభాస్ 20లో మాత్రం ఫైట్స్ అన్నీ రియలిస్టిక్ గా ఉండేలా చేస్తున్నారట. ఇటీవల జార్జియాలో తీసిన ఫైట్ రియలిస్టిక్ గానే ఉంటుందట. అందులో ప్రభాస్ రన్నింగ్ ఒక హైలైట్ అయితే... సెట్ మరో హైలైట్. సుమారు 150 మంది పది రోజులు కష్టపడి రెండు కోట్ల రూపాయల ఖర్చుతో మార్కెట్ సెట్ వేశారట. అదెలా ఉంటుందో సినిమా విడుదలైతే గానీ తెలియదు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ మరో 30 రోజులపాటు జార్జియాలో జరుగుతుంది.
Also Read