వాళ్లంత తీసుకున్నప్పుడు.. ప్రభాస్ తీసుకోకూడదా?
on Oct 28, 2017
సల్మాన్ ఖాన్ పారితోషికం.. అక్షరాలా 60 కోట్లు
అమీర్ ఖాన్ పారితోషికం... 50 కోట్లు
షారుఖ్ ఖాన్ పారితోషికం.. 40 నుంచి 45 కోట్లు
అక్షయ్ కుమార్ పారితోషికం.. 40 కోట్లు
రజనీకాంత్ పారితోషికం... 40 కోట్లు
అజయ్ దేవగన్ పారితోషికం... 25 కోట్లు
నార్త్ ఇండియాలో పెద్దగా మార్కెట్ కూడా లేని హీరోల పారితోషికాల గురించి చెప్పుకుంటే...
పవన్ కల్యాణ్ పారితోషికం... 30 కోట్లు
తమిళ హీరో విజయ్.... 25 కోట్లు
తమిళ హీరో అజిత్... 25 కోట్లు
మహేశ్ బాబు... 20 కోట్లు
ఎన్టీయార్ .... 15 నుంచి 20 కోట్లు
ఇప్పుడు ఈ లిస్ట్ దేనికంటే... బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్... ప్రభాస్ పై ఉత్తరాది అహంకారాన్ని ప్రదర్శించాడు. నర్మగర్భంగా ఒక ట్వీట్ కూడా చేశాడు. అది ప్రభాస్ పై చేసిన ట్వీటే అని అందరూ అనుకుంటున్నారు. దానికి కారణం ఏంటి? అనే విషయాల్లోకెళ్తే.. ‘బాహుబలి’ సినిమాను బాలీవుడ్ లో కరణ్ జోహార్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా పెద్ద విజయం సాధించి కరణ్ కి లాభాలు తెచ్చిపెట్టింది. ఆ మూడ్ లో ఉన్నప్పుడు.. ‘ప్రభాస్ ని నేనే.. బాలీవుడ్ కి పరిచయం చేస్తా. తనతో స్ట్రైట్ బాలీవుడ్ సినిమా తీస్తాను’ అని ప్రకటించాడు. మాట జారాడు కాబట్టి... చేసేది లేక.. ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేశాడు. ఆ సినిమాకు ప్రభాస్ 20 కోట్లు పారితోషికం అడిగాడు. నిజానికి అదేం పెద్ద ఎక్కువ కాదు. ఎందుకంటే.. ఇప్పుడు ప్రభాస్ నేషనల్ స్టార్. తనకు బాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆ మాటకొస్తే.. సౌతిండియా మొత్తం కూడా ప్రభాస్ కి మార్కెట్ ఉంది. ప్రభాస్ తో సరిగ్గా సినిమా తీసి.. అన్ని భాషల్లో విడుదల చేస్తే.. కాసుల వర్షమే. మరి అలాంటప్పుడు అంత మార్కెట్ ఉన్న హీరో 20 కోట్లు అడగడం పెద్ద నేరమా? కానీ.. కరణ్ కి అది నేరంలా కనిపించింది. ‘దక్షిణాదిలో రజనీకాంతే అంత తీసుకోడు’ అన్నట్లు సహచరులతో చులకనగా మాట్లాడినట్లు సమాచారం. దక్షిణాదిలో పెద్దగా మార్కెట్ లేని ఖాన్ త్రయానికి కోటాను కోట్లు ధారపోస్తున్న బాలీవుడ్ నిర్మాతలు... ఇండియా మొత్తం మార్కెట్ ఉన్న ప్రభాస్ కి 20 కోట్లు ఇవ్వడం ఎక్కువేం కాదే. దీన్ని ఉత్తరాది అహంకారం అనక ఏం అనాలి. పైగా ఈ వ్యవహారంపై కరణ్ జోహార్ ఓ ట్వీట్ చేశాడు. “ధ్యేయమా, నీ పూర్తి సామర్థ్యం బయటపడాలంటే నీ ఆజన్మ శత్రువు ‘ఒకరితో పోల్చుకోవడం’ (అనే దురలవాటు) కి దూరంగా ఉండాలి” అనేది ఆ ట్వీట్ చేశాడు. ఇది ఖచ్చితంగా ప్రభాస్ ని ఉద్దేశించిన పోస్టే అని అందరూ అనుకుంటున్నారు. ఈ వ్యవహారం జరగక ముందు వరకు ప్రభాస్ తో స్నేహంగా ఉన్న కరణ్... కొన్ని రోజులుగా ప్రభాస్ కి దూరంగా ఉంటున్నాడు. చివరకు అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టిన రోజున కూడా ఆయనకు విషెస్ చెప్పలేదు. పైగా ప్రభాస్ తో చేయాలనుకున్న సినిమాకు హీరోగా వరుణ్ ధావన్ ని తీసుకున్నాడు. దీన్ని బట్టి... వ్యవహారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రం... కరణ్ జోహార్ టాపిక్ వస్తే... అతనిదేముందిలే... శతకోటి లింగాలో ఓ బోడి లింగం అన్నట్లు మాట్లాడుకుంటున్నారట. ఇదండీ సంగతి.