`ఆర్ఆర్ఆర్` లో అతిథిగా ప్రభాస్!!
on Feb 2, 2019
యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్ లో దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్`(వర్కింగ్ టైటిల్). అత్యంత భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.పిరియాడిక్ టచ్ తో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పటికే తొలి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. తాజా షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. సినిమాలోని ఓ కీలక సన్నివేశంలో భాగంగా ఈ పాత్ర వస్తుందని టాక్. ఇది వరకు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన `ఛత్రపతి`, `బాహుబలి` సిరీస్ ప్రభాస్ కు కథానాయకుడిగా ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజమౌళి అడిగిన వెంటనే ప్రభాస్ కూడా ఈ క్రేజీ మల్టీస్టారర్ లో అతిథిగా కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అయితే ప్రభాస్ ఎంట్రీ పై క్లారిటీ రావాల్సిఉంది. 2020 వేసవిలో `ఆర్ఆర్ఆర్` తెరపైకి రానుంది.