ప్రభాస్ హైదరాబాద్ వచ్చాడు! కానీ...
on Dec 13, 2019
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హైదరాబాద్ కి వచ్చేశాడు. 'సాహో' విడుదల అయినప్పటి నుండి ఇప్పటివరకు ఈ హీరో కొత్త సినిమా షూటింగులో పాల్గొన్నది లేదు. విశ్రాంతిలోనే ఉన్నాడు. మధ్యలో ఒకసారి లండన్ వెళ్లి వచ్చాడు. అక్కడ ప్రఖ్యాత థియేటర్లో లైవ్ మ్యూజిక్ ఆర్కెస్ట్రాతో 'బాహుబలి' షో వేస్తే హాజరయ్యాడు. లండన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ప్రేమకథాచిత్రం షూటింగ్ ప్రారంభిచాలని యూనిట్ భావించింది. కానీ, ప్రభాస్ సిద్ధంగా లేకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. తర్వాత నవంబర్ లో మరోసారి షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నారు. మళ్లీ ప్రభాస్ నో చెప్పాడు. హాలిడే ట్రిప్ కి వెళ్ళాడు. దాంతో యూనిట్ సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ప్రభాస్ హైదరాబాద్ వచ్చాడు. కానీ, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే దానిపై క్లారిటీ లేదు.
ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్, ప్రభాస్ బంధువు ప్రమోద్, స్నేహితుడు వంశీల నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ సంయుక్తంగా రాధా కృష్ణ కుమార్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇది ఆల్మోస్ట్ ప్రభాస్ సొంత సినిమా అనే చెప్పాలి. బయట నిర్మాతలు అయితే షెడ్యూల్ ప్రకారం షూటింగ్ చేయమని గట్టిగా అడిగే అవకాశం ఉంది. సొంత నిర్మాతలు కావడంతో ప్రభాస్ ఎప్పుడంటే అప్పుడు షూటింగ్ చేద్దామని మౌనంగా ఉన్నారు. సాహో ఫలితం చూశాక... కథలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకోవడం కూడా షూటింగ్ వాయిదా పడడానికి మరో కారణమని ఫిల్మ్ నగర్ టాక్. కొత్త ఏడాదిలో ఫ్రెష్ గా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారట.