ట్రైబల్ గాళ్‌గా పూజా హెగ్డే?
on Jan 25, 2021
జిల్ జిల్ జిగేల్ రాణి అంటూ రంగస్థలం కోసం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్రత్యేక గీతం పాడుకున్న పూజా హెగ్డే.. త్వరలో అతనికి జోడీగా నటించబోతోందట. అంతేకాదు.. ఇంతవరకు పోషించని సరికొత్త పాత్రలో కనిపిస్తుందట.
ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న చిత్రం ఆచార్య. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో అతని పాత్ర పేరు సిద్ధ. ఇటీవలే షూటింగ్ లో జాయిన్ అయ్యారు కూడా. ప్రస్తుతం చిరు, చరణ్ కాంబోలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం. కాగా, ఇందులో చిరుకి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, చరణ్ కి జంటగా పూజా హెగ్డేని ఎంపిక చేశారట కొరటాల. పాత్ర పరిధి తక్కువే అయినా నటనకు అవకాశమున్న రోల్ లో పూజ సందడి చేయనుందని.. ట్రైబల్ గాళ్ గా ఆమె వేషం ఉంటుందని టాక్. అదే గనుక నిజమైతే.. పూజని సరికొత్త భూమికలో చూడబోతున్నట్టే. త్వరలోనే ఆచార్యలో పూజ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్న ఆచార్య వేసవి కానుకగా మే 9న విడుదల కానుందని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
