`పోకిరి`ని బీట్ చేసేలా ఇస్మార్ట్ సాంగ్!!!
on Feb 15, 2019
పూరి జగన్నాథ్ అంటేనే సమ్ థింగ్ న్యూ. ఆయన సినిమాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. హీరో క్యారక్టరైజేషన్ కు మాత్రమే ఆయన స్పెషలిస్ట్ కాదు...ఐటమ్ సాంగ్స్ ఆయన సినిమాల్లో అదిరిపోయేలా ఉంటాయి. ఇక పూరి డైరక్షన్ లో వచ్చిన `పోకిరి ` చిత్రంలో ఇప్పటికింకా..నా వయసు నిండా పదహారే అంటూ వచ్చిన స్పెషల్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. మణిశర్మ కంపోజ్ చేసిన ట్యూన్, భాస్కరభట్ల సాహిత్యం, ముమైత్ ఖాన్ భంగిమాలు ఆ పాటను ఓ రేంజ్ కి తీసుకెళ్లి సినిమాకే ఆ పాట హైలెట్ గా నిలిచేలా చేసాయి. ఇక ప్రజంట్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ `ఇస్మార్ట్ శంకర్` చిత్రాన్ని డైరక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కూడా మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అయితే `పోకిరి` తరహాలో ఒక పాటను పెట్టాలని డిసైడ్ అయ్యాడట పూరి. మణిశర్మ బాణీకి, భాస్కరభట్ల అద్భుతమైన లిరిక్స్ రాసారట. ఇప్పటికే రికార్డింగ్ పూర్తైన ఈ పాట ఇప్పటికింకా తరహాలో ఓ ట్రెండ్ సృష్టించేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలో ముమైత్ ఖాన్ లా ఓ కొత్త అమ్మాయిని పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రం మే నెలలో తెరపైకి రానుంది.