English | Telugu

`పేట‌` ట్రైల‌ర్... పేట్రేగిపోతున్న ఫ్యాన్స్!!

on Jan 2, 2019

 సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్  న‌టించిన `2.ఓ` త‌ర్వాత విడుద‌వుతోన్న చిత్రం `పేట‌`.  కార్తిక్ సుబ్బ‌రాజ్ డైర‌క్ట్  చేసిన ఈ సినిమాను స‌న్ పిక్చ‌ర్స్ అధినేత క‌ళానిధి మార‌న్ భారీగా నిర్మించారు. ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ విడుద‌ల చేసారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ వెర్ష‌న్ `పేట‌` ట్రైల‌ర్ చూసి ఎంజాయ్ చేసిన ర‌జ‌నీ ఫ్యాన్స్ లేటెస్ట్ గా విడుద‌లైన తెలుగు ట్రైల‌ర్ ను చూసి లుంగీ డాన్స్ చేస్తున్నారు. `పేట‌` సినిమాతో ర‌జ‌నీ కాంత్ మ‌రోసారి త‌న‌దైన స్టైల్లో అవుట్ అండ్ అవుట్ మాస్ ఎలిమెంట్స్ తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నాడు. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ హాస్టల్ వార్డెన్ గా న‌టించాడు. అస‌లు ఆయ‌న వార్డెన్ గా ఎందుకు మారాడు , దానికి వెనక క‌థా క‌మామీషు ఏంట‌న్న‌ది సినిమా క‌థాంశం.  ఇదంతా వింటుంటే `భాషా ` త‌ర‌హా ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉంద‌ని అర్ధ‌మవుతోంది క‌దా!. ఇక ట్రైల‌ర్ ర‌జ‌నీ ఇమే జ్ కు త‌గ్గ‌ట్టుగా క‌ట్ చేసారు అన‌డంలో డౌట్ లేదు. ర‌జ‌నీ శైలిలో ఉండే మేన‌రిజంతో ఈ చిత్రం ఉండ‌బోతుంద‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది.  యాక్ష‌న్ సీన్స్ తో చ ర‌జ‌నీ మార్క్ డైలాగ్స్ తో సుబ్బరాజ్ ఈ సినిమాను ఫ్యాన్స్ కు పండ‌గ‌లా రూపొందించాడు. ఇప్ప‌టికే ఈ ట్రైల‌ర్ చూసిన ఫ్యాన్స్ పేట్రేగిపోతున్నారు.  తెలుగులో ఈ చిత్రాన్ని ఈ నెల 10న అశోక్ వ‌ల్ల‌భ‌నేని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here