కొత్త సినిమాకు సైన్ చేసిన ఆర్ ఎక్స్ భామ!!
on Oct 15, 2018
`ఆర్ ఎక్స్ 100` చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆమె ఆ చిత్రంలో తన అందాల ఆరబోతతో యూత్ ను ఫిదా చేసింది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ పలు షాపుల ప్రారంభోత్సవాలతో బిజీ బిజీ గా గడుపుతోంది. ఈ మూవీ తర్వాత ఈ భామ ఏ సినిమా చేస్తుందనే దానిపై టాలీవుడ్లో పెద్ద డిస్కషనే నడుస్తోంది. అయితే తాజాగా పాయల్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే...
ఇటీవలే ఆర్ ఎక్స్ భామ సి.కె.ఎంటర్ టైన్ మెంట్ బేనర్ లో తెరకెక్కించే సినిమాలో హీరోయిన్ గా అవకాశం కొట్టేసిందట. అంతే కాదు ఈ బేనర్ లో చేయబోయే సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా అయిపోయింది. పాయల్ హీరోయిన్ గా నటించబోతున్న ఈ మూవీని డైరక్ట్ చేసేది ఎవరు? హీరో ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలో దీనికి సంబంధించిన న్యూస్ అధికారికంగా వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అమ్మడు లేటు గా అయినా లేటెస్ట్ గా మంచి ఆఫరే కొట్టే సిందంటున్నాయి సినీ వర్గాలు.