అజ్ఞాతవాసి ఆఫీస్‌పై ఎగబడ్డ ఫ్యాన్స్.. తొక్కిసలాట
on Dec 18, 2017
ప్రజంట్ తెలుగునాట భీభత్సమైన క్రేజ్ ఉన్న హీరో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ అంటే ఒక హీరో, ఒక పేరు కాదు.. పవన్ అంటే ప్రభంజనం అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఆయన సినిమా రిలీజవుతోంది అంటే థియేటర్ల ముందు తొక్కిసలాట కంపలర్సీ.. కుర్చీలు ఇరిగిపోతాయ్, థియేటర్లు జామ్ అయిపోతాయి.
పవన్‌ను తెర మీద చూడటానికే ఇంత కష్టపడుతుంటే.. ఇక అభిమాన నటుడిని ప్రత్యక్షంగా చూసే అవకాశం వస్తే ఫ్యాన్స్ వదులుకుంటారా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటిస్తోన్న అజ్ఞాతవాసి ఆడియో రిలీజ్ వేడుక ఈ నెల 19న హైదరాబాద్‌లో జరగనుంది. ఇందుకోసం హైటెక్స్‌లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌కు పవన్ వస్తుండటంతో ఆయన్ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఎంట్రీ పాస్‌ల కోసం హారికా హాసిని క్రియేషన్స్ ఆఫీసు వద్దకు రెండు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. దీంతో వారిని అదుపు చేయడానికి బౌన్సర్లను ప్రయోగించడంతో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం. ఏమైనా పవన్ ఫ్యాన్సా మజాకా..!