ఈ ‘కుశాల్ బాబు’ గోలేంటండీ బాబూ...!
on Oct 4, 2017
కాలం కలిసిరాకపోతే... పేర్లు మార్చుకోవడం సహజమే. సినిమావాళ్లయితే... ఊరకూరకనే పేర్లు మార్చేస్తుంటారు. కానీ... సూపర్ స్టార్లకు ఆ అవసరం రాదు. ఎందుకంటే... వాళ్లు పట్టిందల్లా బంగారమే కదా. ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమా సినిమాకూ అమాంతం వారి బిజినెస్ పెరిగిపోతూ ఉంటుంది. అంతేకాదు... వారి పేర్లు అభిమానుల గుండెల్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది. తమ బిడ్డలకు కూడా అదే పేర్లు పెట్టుకునే ఫ్యాన్స్ ఉన్నారు. మరి అలాంటి స్టార్లకు పేర్లు మార్చుకునే అవసరం ఏముంటుంది చెప్పండి? మన పవర్ స్టార్ కూడా దాదాపు అలాంటి స్టార్ డమ్ ఉన్న హీరోనే కదా. ఇప్పుడు ‘పవన్ కల్యాణ్’ అనే పేరు ఓ బ్రాండ్. తెలుగు నేలపై అత్యధిక అభిమాన గణం ఉన్న కథానాయకుడు వపర్ స్టార్. మరి ఆయన పేరు మార్చుకోవడం ఏంటి? విడ్డూరం కాకపోతే. అసలు నిజానికి పవర్ స్టార్ పేరు ‘కల్యాణ్ బాబు’. ‘అక్కడమ్మాయ్ ఇక్కడబ్బాయ్’ సినిమా టైటిల్స్ లో ‘కల్యాణ్ బాబు’అనే పడుతుంది. ‘గోకులంలో సీత’ నుంచి ‘పవన్ కల్యాణ్’ అయ్యాడు. ఏ ముహూర్తాన ఆ పేరు పెట్టుకున్నాడో... ఆపకుండా అరడజను హిట్లు ఇచ్చేశాడు. యువతరానికి రోల్ మోడల్ అయ్యాడు.
ఫ్లాపులొచ్చినా... పవర్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు దాదాపు ‘నంబర్ వన్’ అయ్యాడు. పార్టీ స్థాపించి రాజకీయాల్లో కూడా కింగ్ మేకర్ అనిపించుకున్నాడు. అంత కీర్తినిచ్చిన ‘పవన్ కల్యాణ్’ అనే పేరును పవర్ స్టార్ మార్చుకోవడం ఏంటి? గూగుల్ పవన్ పేరును ‘కుశాల్ బాబు’ అని చూపిస్తోంది. విక్కీపిడియా ఓపెన్ చేసినా... ‘కుశల్ బాబు’ అనే కనిపిస్తోంది. ఇదేమన్నా టెక్నిల్ ప్రాబ్లమా? లేక పవర్ స్టార్ నిజంగానే పేరు మార్చుకున్నాడా? ఇప్పడు ఎక్కడ చూసినా ఇదే టాపిక్. త్రివిక్రమ్ సలహా మీద ఆయన ‘కుశాల్ బాబు’ అని పేరు మార్చుకున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయ్. మరి ఇందులో నిజం ఏంటో చూడాలి.