తెలుగులో పవన్కళ్యాణే టాప్!
on Dec 5, 2018
ప్రతి ఏడాదీ ఫోర్బ్స్ సంస్థ దేశవ్యాప్తంగా ఎక్కువ సంపాదన ఆర్జించిన ప్రముఖుల జాబితాను విడుదల చేస్తుంది. ఈ ఏడాదీ విడుదల చేసింది. అందులో తెలుగు నుంచి పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ చోటు సంపాదించారు. దర్శకుల నుంచి కొరటాల శివ ఒక్కడే చోటు సంపాదించడం విశేషం. తెలుగు నుంచి ఫోర్బ్స్ జాబితా;లో చోటు సంపాదించిన ప్రముఖుల్లో పవన్ కల్యాణే టాప్. ఆయన సంపాదన 2018లో 31.33 కోట్ల రూపాయలు. ఫోర్బ్స్ జాబితాలో ఆయన స్థానం 24. పవన్ తర్వాత ఎన్టీఆర్ (రూ.28 కోట్లు, 28వ స్థానం), మహేశ్ (రూ.24.33 కోట్లు, 33వ స్థానం), నాగార్జున (రూ.22.25 కోట్లు, 36వ స్థానం), కొరటాల శివ (రూ.20 కోట్లు, 39వ స్థానం), అల్లు అర్జున్ (రూ.15.67 కోట్లు, 64వ స్థానం), రామ్చరణ్ (రూ.14 కోట్లు, 72వ స్థానం), విజయ్ దేవరకొండ (రూ.14 కోట్లు, 72వ స్థానం) ఈ జాబితాలో వున్నారు.